ప్రియుడిని చంపిన ప్రియురాలు
ఆదిలాబాద్: ప్రియురాలు ప్రియుడిని హత్య చేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ లో మడాలి రాంబాయి అనే మహిళ తన ప్రియుడు మడాలి జంగును హత్య చేసింది. మడాలి జంగు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడంతో ఆమె ఈ హత్యకు పాల్పడింది.
రెండేళ్ల క్రితం రాంబాయి భర్త మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. ఆమె మడాలి జంగుతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అయితే ఇటీవల అతను మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే రాంబాయి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోమవారం రాత్రి ఇద్దరు బాగా తాగారు. ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ సమయంలో రాంబాయి జంగును హత్య చేసింది. జంగును తానే హత్య చేసినట్లు రాంబాయి పోలీసుల విచారణలో అంగీకరించింది.












Click it and Unblock the Notifications