విశాఖపట్నం: సినీ నటుడు రాజశేఖర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. రాజశేఖర్ పై విశాఖపట్నంలో దళితులు మండిపడ్డారు. అంబేడ్కర్ కు, ఫూలేకు రాజకీయాలేం తెలుసునని రాజశేఖర్ వ్యాఖ్యానించినట్లు ఆరోపిస్తూ దళితులు ఆందోళనకు దిగారు. రాజశేఖర్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజశేఖర్ కు వ్యతిరేకంగా దళితులు ధర్నా చేశారు. రాజశేఖర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంబేడ్కర్ విగ్రాహానికి వారు క్షీరాభిషేకం చేశారు.