షేర్ మార్కెట్ కు కుటుంబం బలి
హైదరాబాద్: షేర్ మార్కెట్ సంక్షోభం హైదరాబాదులోని ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడుల కోసం భారీగా అప్పులు చేసిన ఉపేందర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులోని సైదాబాద్ లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
గ్యాస్ సిలిండర్ పేలి ఉపేందర్ తో పాటు అతని భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అప్పుల బాధ తట్టుకోలేకనే ఈ కుటుంబం ఆత్యహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారి ముఖాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. గురువారం ఉదయం ఇంట్లోనుంచి పొగలు వస్తుండడంతో స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి చూసే సరికి నలుగురు మరణించి ఉన్నారు.












Click it and Unblock the Notifications