అమెరికా ప్రభావం: సెన్సెక్స్ పతనం
ముంబయి: అమెరికా మార్కెట్ కుప్పకూలడంతో ముంబయి స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 601 పాయింట్లమేర భారీ పతనం చెంది 12,663 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 163 పాయింట్ల మేర నష్టపోయి 3845 పాయింట్ల వద్ద ఉంది. సెన్సెక్స్ గత కొన్ని రోజులుగా పతనం చెందుతూ మదుపుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
నష్టపోయిన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్, జైప్రకాష్ అసోసియేట్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, సత్యం, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇన్‌ఫ్రా, రాన్‌బాక్సీ, డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, భెల్, రిలయన్స్ ఇండ్, లార్సెన్ అండ్ టుబ్రో, హిండాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టాటా మోటార్స్, గ్రాసిం ఇండ్, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, అంబూజా సిమెంట్స్, ఏసీసీ, ఐటీసీ, ఎన్టీపీసీ, హిందూస్థాన్ లీవర్ వంటివి ఉన్నాయి.












Click it and Unblock the Notifications