మృతుల గుర్తింపు: ఒకరి అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియానగర్ లో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన ఎదురు కాల్పులు ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులను అతిక్, ఫక్రుద్దీన్ లుగా గుర్తించారు. అతిక్ అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్ల కేసుల్లో నిందితుడని ప్రత్యేక విభాగం జాయింట్ పోలీసు కమీషనర్ కర్నైల్ సింగ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఫక్రుద్దీన్ అతిక్ అనుచరుడని ఆయన చెప్పారు.
మరో ఇద్దరు ఉగ్రవాదులు పారిపోయినట్లు సమాచారం. ఒక ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇన్సెక్టర్ మోహన్ చంద్ శర్మతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. శర్మకు కడుపులో బుల్లెట్ గాయం అయింది. ఢిల్లీ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి సుభాన్ ఖురేష్ జులైలో ఆశ్రయం పొందిన జామియానగరులోని నాలుగు అంతస్తుల భవనాన్ని అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అనుమానితుడు అబూ బషీర్ చూపించాడు. బషీర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.












Click it and Unblock the Notifications