సౌమ్య హత్య కేసు: దొరికిన గన్
హైదరాబాద్: అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని సౌమ్య, ఆమె సోదరుడు విక్రంరెడ్డి హత్య కేసులో పోలీసులకు గన్ లభ్యమైంది. వారి హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న గన్ ను సన్ ఫిష్ లేక్ వద్ద సెయింట్ లూయిస్ కౌంటీ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ గన్ హత్యకు ఉపయోగించిందా, కాదా అనే విషయాన్ని తగిన పరీక్షల ద్వారా నిరూపించుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇలినోయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రిటిక్ ఇంజనీరింగ్ చదువుతున్న సౌమ్య శవం ఆమె సోదరుడు విక్రం రెడ్డి కారులో శనివారం కనిపించగా విక్రం రెడ్డి శవం సోమవారం సరస్సులో తేలుతూ కనిపించింది. ఈ హత్య కేసు మిస్టరీని విడదీయడానికి డిటెక్టివ్ లు కూడా రంగంలోకి దిగారు. విక్రంరెడ్డి ఇరుగు పొరుగువారిని ప్రశ్నించినప్పటికీ పోలీసులకు తగిన సమాచారం లభించలేదు. సౌమ్య, విక్రంరెడ్డి పార్కుకు ఎందుకు వచ్చారనే విషయాన్ని కూడా పోలీసులు తేల్చుకోలేక పోతున్నారు.












Click it and Unblock the Notifications