ఢిల్లీలో ఎదురుకాల్పులు: ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఢిల్లీలోని జామియా నగర్ లోని ఓ ఇంటిలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందిన పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు తీవ్రవాదులు మరణించినట్లు సమాచారం.
ఎదురుకాల్పులు ఇంకా జరుగుతుండడంతో మృతుల సంఖ్య కచ్చితంగా తెలియడం లేదు. ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఢిల్లీ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అబు బషీర్ విచారణలో పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఈ దాడి నిర్వహించినట్లు సమాచారం. మృతులను హుజి మిలిటెంటుగా అనుమానిస్తున్నారు. మరో కుట్రకు తీవ్రవాదులు ఈ ఇంట్లో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications