రాజమండ్రి: చిరంజీవి కటౌట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టటంతో రాజమండ్రిలో ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి జరిగిన ఈ సంఘటనకు నిరసనగా చిరు అభిమానులు రాస్తారోకో చేశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చిరు కటౌట్‌ను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని వారు డిమాండ్‌చేశారు. అనంతరం చిరంజీవి కటౌట్‌కు పాలాభిషేకం నిర్వహించారు. త్వరలో బాలకృష్ణ కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న నేపధ్యంలో వివిధ హీరోల అభిమానుల మధ్య మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయి.