రోజాపై శోభా నాగిరెడ్డి ధ్వజం
హైదరాబాద్: చిరంజీవి మీద, ఆయన ప్రజారాజ్యం పార్టీ మీద అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్న తెలుగు మహిళ అధ్యక్షురాలు, ఒకనాటి హీరోయిన్ రోజా మీద ఇటీవలే చిరంజీవి పార్టీలో చేరిన శోభా నాగిరెడ్డి తీవ్ర స్ధాయిలో విరుచుకు పడ్డారు. అనేక ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న శోభా నాగిరెడ్డి టిడీపి అధినేత చంద్రబాబు నాయుడు మీద కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు తీసుకోనిదే చంద్రబాబు నాయుడు పార్టీ టికెట్ ఇచ్చేవారు కాదని ఆమె విమర్శించారు. కొత్తగా ప్రజారాజ్యం పార్టీలో చేరిన శోభా నాగిరెడ్డి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో శోభా నాగిరెడ్డి ఈ ప్రకటన చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications