ఢిల్లీ పేలుళ్లు: అతిఫ్ గ్రామంలో సోదాలు
లక్నో: ఢిల్లీ వరుస పేలుళ్ల నిందితుడు అతిఫ్ స్వగ్రామంలో ఢిల్లీ పోలీసులు, ఉత్తరప్రదేశ్ తీవ్రవాద నిరోధక బలగాల సంయుక్త బృందం మంగళవారం సోదాలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ లోని అజమ్ ఘర్ జిల్లాలో అతిఫ్ స్వగ్రామం సరైమీర్ ఉంది. ఈ బృందం సభ్యులు మంగళవారం తెల్లవారు జామును సరైమీర్ గ్రామం చేరుకున్నారు. అతిఫ్ బంధువులను వీరు ప్రశ్నించారు.
గ్రామాన్ని దిగ్బంధం చేసి గ్రామంలోని ప్రతి ఇంటిని వారు సోదా చేశారు. సోదాలు పూర్తయ్యే వరకు గ్రామం నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయలేదు. అతిఫ్ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు వారు సేకరించగలిగినట్లు సమాచారం. ఒక జాతీయ బ్యాంకు పవాయ్ శాఖలో అతిఫ్ ఖాతా ఉంది. గత ఆరు నెలల కాలంలో ఈ ఖాతా ద్వారా మూడు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు వారి దృష్టికి వచ్చింది. బ్యాంకు మేనేజర్ ను కూడా వారు ప్రశ్నించనున్నారు. వీలైతే అరెస్టు చేసినవారిని తీసుకెళ్లడానికి లక్నో నుంచి ఆజంఘర్ కు ఒక చాపర్ కూడా వచ్చింది.












Click it and Unblock the Notifications