విశాఖపట్నం: ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేయాలనుకుంటున్నానని చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ నేడిక్కడ చెప్పింది. చిరంజీవి అభిలాషకు వ్యతిరేకంగా శ్రీజ గత అక్టోబర్ లో కులాంతర, ప్రేమ వివాహం చేసుకుంది. సినిమా ఫక్కీలో ఆర్య సమాజంలో దండల పెళ్ళి చేసుకున్న తర్వాత ఢిల్లీలో దాదాపు 15 రోజుల హైడ్రామా తర్వాత శ్రీజ, శిరీష్ భరద్వాజ్ దంపతులు హైదరాబాద్ కు చేరుకుని బేగంపేటలోని ఒక విలాసవంతమైన ఫ్లాట్ లో ఉంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయ రంగంలో సంచలనం రేకెత్తించిన చిరంజీవి పార్టీకి శ్రీజ ప్రచారం అవసరమా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. శ్రీజ, శిరీష్ లకు ఇటీవల ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప పేరు నివృతి అని తెలుస్తోంది.