హైదరాబాద్ : మహాకూటమిలో చేరేదిలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో పొత్తులు వుండవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన సమస్యలపై రెండు రోజుల్లో అధ్యయన కమిటీలు నియమించాలని ప్రజారాజ్యం నిర్ణయించింది. ఈ కమిటీలు వీలైనంత త్వరగా తమ నివేదికలు సమర్పించాలని ఆయన కోరారు. మౌలిక విధానాల్లో సారూప్యత ఉండటం వల్లనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు.