ఎమ్మెల్యే పేరు చెప్పి జెసికి బురిడీ
హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డిని, శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓ ఘనుడు బురిడీ కొట్టించాడు. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి బూర్గంపాడు శాసనసభ్యుడు చిట్టూరి రవీంద్ర పేరిట ఫోన్‌చేసి - అత్యవసరంగా కూతురి ఫీజు కోసం డబ్బు కావాలని అడిగాడు. దాంతో వెంటనే జేసీ దివాకర్ రెడ్డి 50వేల రూపాయలు, వెంకట రెడ్డి 40వేల రూపాయలు ఆ వ్యక్తి చెప్పిన ఖాతాలో డబ్బు వేశారు.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా వెళ్లినప్పుడు మంత్రి జెసి దివాకర్ రెడ్డి రవీంద్ర కుటుంబసభ్యుల బాగోగుల విషయాలు అడిగారు. కూతురు బాగా చదువుకుంటుందా అని అడిగారు. తనకు కూతురు లేదని చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు. వెంటనే ఖాతా వివరాలు పరిశీలించగా వాటితో రవీంద్రకు సంబంధం లేదని తెలిసింది. డబ్బుల కోసం తాను ఎవరికీ ఫోన్ చేయలేదని రవీంద్ర స్పష్టం చేశారు. ఈ విషయంపై చర్య తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు.












Click it and Unblock the Notifications