మహబూబ్ నగర్: తాను అందరిలాంటి నేతను కాదని, తాను అందిరిలా వచ్చి చూసి పోయే నేతను కానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. త్వరలోనే పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) బాధితుల సమస్యలను తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. పోలేపల్లి సెజ్ బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. తమకు నష్టపరిహారం కూడా సరిగా చెల్లించడం లేదని బాధితులు చిరంజీవికి చెప్పుకున్నారు.
పేదల భూములను లాక్కుని హృదయాలను గాయపరిచారని ఆయన వ్యాఖ్యానించారు. పేదల కష్టాలు ఎన్నాళ్లో ఉండవని, త్వరలోనే పరిస్థితులు మారుతాయని ఆయన అన్నారు. అమాయకుల ప్రాణఆలతో ఆడుకుంటూ అభివృద్ధి అంటే పద్ధతి కాదని ఆయన అన్నారు.