పడవ ప్రమాదం: నలుగురు మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో నాటు పడవ మునిగి శుక్రవారం నలుగురు మరణించారు. మరో పది మంది గల్లంతయ్యారు. నాగావళి నదిలో నాటు పడవ మునిగి ఈ ప్రమాదం సంభవించింది. వంగర మండలం రుషింగి, వీరఘట్టం మండలం కిమ్మిలకు మధ్య ఈ ప్రమాదం సంభవించింది. రుషింగి గ్రామానికి చెందిన దాదాపు 20 మంది నాటు పడవలో కిమ్మికి బయలుదేరారు. ఈ సమయంలో అదుపు తప్పి పడవ నదిలో మునిగింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్నవారు నీళ్లలో మునిగారు. వారిలో నలుగురు మరణించారు. మిగతా వారంతా గల్లంతయ్యారు.












Click it and Unblock the Notifications