అణు ఒప్పందం ఆమోదం వాయిదా

భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం శ్వేత సౌధం చేరుకున్నారు. అయితే అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తో కలిసి అణు ఒప్పందంపై సంతకం మాత్రం చేయలేకపోయారు. మన్మోహన్ సింగ్ న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కు బయలుదేరి వచ్చారు. మన్మోహన్ సింగ్, బుష్ ల సమావేశం అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకు) జరగాల్సి ఉంది. అయితే అమెరికా అధ్యక్ష అభ్యర్థులు బరాక్ ఒబామా, జాన్ మెక్ కెయిన్ లతో ఆర్థిక సంక్షోభంపై బుష్ చర్చల్లో మునిగి ఉండడంతో ఆ భేటీ 20 నిమిషాలు ఆలస్యంగా జరిగింది.












Click it and Unblock the Notifications