ఖమ్మం జిల్లాలో 3గురు నక్సల్స్ హతం
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లు మరణించారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, నక్సలైట్లు ఎదురైనట్లు, ఈ సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
మృతుల్లో సురేష్ అనే దళ సభ్యుడ్ని మాత్రం గుర్తించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. మోహనన్న దళం ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ దళం కొంత మంది నుంచి డబ్బులు వసూలు చేస్తోందని, కొంత మంది ప్రముఖులను లక్ష్యం చేసుకుందని తెలుస్తోంది. ఈ స్థితిలో పోలీసులు ఈ దళం కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ నుంచి మోహనన్న తప్పించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications