తెరాస కార్యకర్తల అరెస్టు : ధర్నా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో హిల్స్ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు నిరసనగా తెరాస కార్యకర్తలు హైదరాబాదులోని బంజరాహిల్స్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు.
తమ కార్యకర్తపై దాడి చేసిన రాజగోపాల్ ను విచారించకుండా, ఆయనపై కేసు నమోదు చేయకుండా తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని హరీష్ రావు వ్యతిరేకించారు. రాజగోపాల్ ను అరెస్టు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రాజగోపాల్ ను అరెస్టు చేసిన తర్వాత ల్యాంకో హిల్స్ పై దాడి కేసులో నిందితులైన తమ కార్యకర్తలను తామే అప్పగిస్తామని ఆయన చెప్పారు. తమ కార్యకర్తలను వదిలే వరకు పోలీసు స్టేషన్ ముందు నుంచి కదిలేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications