తెరాస కార్యకర్తల విడుదలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో హిల్స్ కార్యాలయంపై అదుపులోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం ఉదయం విడుదల చేశారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు, మూడు గంటల మధ్య పోలీసులు 12 మంది తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టులకు నిరసనగా తెరాస కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. తాము అదుపులోకి తీసుకున్నవారికి ల్యాంకో కార్యాలయంపై దాడితో సంబంధం లేదని అంటూ పోలీసులు వారిని వదిలిపెట్టారు. అయితే, నిజామాబాద్ జిల్లా సంఘటనపై రాజగోపాల్ ను అరెస్టు చేసే వరకు తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయకూడదని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అంటున్నారు. రాజగోపాల్ ను అరెస్టు చేసిన తర్వాత తమ కార్యకర్తలను తామే పోలీసులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications