విజయవాడ: అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. మూలా నక్షత్రంరోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన బారికేడ్ ఏర్పాటుచేస్తున్నారు. హైదరాబాద్‌నుంచి వచ్చే భక్తులకోసం భవానీపురం ఘాట్ సిద్ధం చేస్తున్నట్లు ఈఓ తెలిపారు.
సీతమ్మవారి పాదాల వద్ద ఆప్రాన్ఘాట్లో షవర్‌బాత్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్ల ఏర్పాటు పూర్తికావచ్చింది. ఇరుకుగా ఉన్న అర్జున వీధిలో దుకాణాలను తొలగించనున్నారు.