దీపావళితో ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది
2026 నవంబరు 8న వచ్చే దీపావళి పండుగ సమయానికి గ్రహాల సంచారం ముఖ్యంగా గురుడు, సూర్యుడు, బుధుడు, కుజుడు అనుకూల స్థానాల్లో ఉన్నవారికి అత్యంత అనుకూలంగా మారనుంది. జ్యోతిష్య పండితుల అంచనాల ప్రకారం ఈ దీపావళి నుంచి ప్రధానంగా 4 రాశుల వారికి విశేషమైన అదృష్టం, ధన లాభం, కెరీర్ లో మంచి పురోగతి కలగనున్నాయి. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గురు సంచారం వల్ల ఆత్మవిశ్వాసం, హోదా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు, గుర్తింపు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో కొత్త భాగస్వామ్యాలు, ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

వృషభ రాశి
ఈ దీపావళి తర్వాత వాహనం, ఇల్లు లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. రావలసిన బాకీలు చేతికి అంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే వాతావరణం ఉంటుంది.
మిథున రాశి
మూడో ఇంట గురుడు, బుధాదిత్య యోగం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితి బాగా పుంజుకుంటుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి.
తులా రాశి
దీపావళి నుంచి ఈ రాశివారికి కాలం చాలా అనుకూలిస్తుంది. సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధన లాభాలు, ఆకస్మిక ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. మేషం, వృశ్చిక రాశులవారికి కుజ గోచారం అనుకూలించడం వల్ల ధైర్యం, కొత్త పెట్టుబడులు కలిసివస్తాయి. కర్కాటక రాశివారికి ధన స్థానంలో గురుబలం వల్ల నిల్వ ధనం పెరుగుతుంది.














Click it and Unblock the Notifications
