అవినీతిపై పోరు ఉధృతం: బాబు
హైదరాబాద్: ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఎల్లంపల్లి నుంచి తన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించడానికి బయలుదేరి వెళ్లే ముందు ఆయన గురువారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎపి ఎక్స్ ప్రెస్ రైళ్లో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరారు. తాము మూడేళ్ల నుంచి అవినీతిని బయట పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
అవినీతిని నిర్మూలించినప్పుడే మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని ఆయన విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలతో బాధపడుతున్నవారిని ఆయన పరామర్శిస్తారు.












Click it and Unblock the Notifications