అంతర్గత కుమ్ములాటలో టిపిడి: తమ్మినేని
విశాఖపట్నం: తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కుతకుత ఉడికిపోతోందని మాజీ మంత్రి, ప్రజారాజ్యం పార్టీ నేత తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ప్రజారాజ్యం పార్టీ కార్యాలయాన్ని ఆయన గురువారంనాడు ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వికలాంగులతో పార్టీ పతాకాన్ని ఆవిష్కరింపజేశారు.
వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఓట్ల కొనుగోలుకు సిద్ధపడుతోందని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్ర ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications