పరిశ్రమలకు మెగా రాయితీలు: గీతారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈరోజు రాయితీలు ప్రకటించింది. తమిళనాడు తరహాలో ఆటోమొబైల్ పరిశ్రమల కోసం అల్ట్రా మెగా ఆటోపాలసీ రూపొందించింది. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఆటో పరిశ్రమ స్థాపనకు వచ్చే కంపెనీలకు 100 శాతం వ్యాట్ రాయితీని 21 ఏళ్లపాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో ఏడు రకాల పరిశ్రమలకు కూడా 50 శాతం వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి తెలిపారు. బెంగాల్ నుంచి వైదొలిగిన నానో కార్ల పరిశ్రమను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications