చిరు పార్టీలో చేరను: అశ్వనీదత్

చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ప్రజారాజ్యంపార్టీలో చేరతారా అని విలేకరులు అడగగా ఆయన తాను టీడీపీలోనే ఉంటానని ఇతర ఏ పార్టీలోను చేరనని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీచేయమని బాబు ఆదేశిస్తే చేస్తానని చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో అశ్వనీదత్ విజయవాడ స్ధానం నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి లగడపాటి రాజగోపాల్ మీద ఓడిపోయారు. ఆ సమయంలో అశ్వనీదత్ కు చిరంజీవే టిడిపి టికెట్ ఇప్పించినట్టు వార్తలు వచ్చాయి. అశ్వనీదత్ కు ఓటు వేయమని చిరంజీవి పరోక్షంగా పిలుపు ఇచ్చినా అభిమానులు స్పందించకపోవడంతో దత్ ఓటమి చవిచూశారు.












Click it and Unblock the Notifications