పేరుకే ఉమెన్స్ హాస్టల్.. లోపల చేసేది తెలిస్తే షాక్ అవుతారు..?

హైదరాబాద్ లో హాస్టల్స్ ముసుగులో మహిళల అండాలను సేకరిస్తున్న భారీ ముఠా గుట్టు రట్టు అయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులకు డబ్బు ఆశ చూపించి పేద యువతుల నుంచి అండాలను సేకరించి వాటిని కార్పొరేట్ ఆస్పత్రులకు అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాంగ్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోని సైబరాబాద్, రాచకొండ పోలీసులు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో 43 మంది బాధితులను కాపాడగా.. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్లంతా బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. సాధారణంగా మహిళలకు వసతి కల్పించే హాస్టల్‌ గా కనిపిస్తున్న ఈ భవనంలో అసలు ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌ నగర్‌ లోని వెంకటేశ్వర కాలనీలో శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ ను దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. సంవత్సరం కాలంగా హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు. అయితే వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను డబ్బు ఆశ చూపించి హైదరాబాద్‌ కు రప్పించిన ఆయన హాస్టల్‌ లో ఉంటున్న ఉన్న యువతులను ప్రలోభపెట్టి నెలనెలా అండాలను సేకరించాడు. ఆ అండాలను కార్పొరేట్ ఆస్పత్రులకు అధిక ధరలకు సరఫరా చేశాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు రెక్కీ నిర్వహించి దుర్గాప్రసాద్​ తో పాటు 8 మందిని అరెస్టు చేశారు.

అటు బేగంపేట లోని ప్రకాశ్ నగర్ లో అమీ నీతా గర్ల్స్ హాస్టల్ పేరుతోనూ ఈ అక్రమ అండాల సేకరణ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. గతేడాది నుంచే యువతుల అండాలను సేకరించి సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ లభించిన సమాచారంతోనే సరూర్ నగర్ లోనూ దాడులు నిర్వహించారు. ఇక ఈ వ్యవహారంపై మల్కాజిగిరి సీపీ సుమతి మాట్లాడుతూ.. అక్రమంగా అండాల సేకరణ, విక్రయాల దందాను గుట్టురట్టు చేశామన్నారు.

Hyderabad latest Gang harvesting women eggs arrested in Hyderabad poor young women were the targets

ఈ దందాలో ఇండోర్ వాసి అమిత్‌ శర్మ ప్రధాన నిందితుడిగా గుర్తించామని స్పష్టం చేశారు. ఈ మేరకు సరూర్ నగర్, ప్రకాశ్‌ నగర్ తో పాటుగా బేగంపేట, ఎర్రగడ్డ, గోపాలపురం ప్రాంతాల్లో సోదాలు చేశామని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళలను గుర్తించి పరీక్షల అనంతరం రక్షణ గృహాలకు పంపించినట్లు స్పష్టం చేశారు. అయితే అక్రమ అండాల సేకరణ వెనుక అసలు సూత్రధారులు ఎవరు..? కార్పొరేట్ ఆసుపత్రులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందా..? అనే కోణంలో విచారణ వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+