పల్నాడులో వైసీపీకి షాక్.. విడదల రజిని, పిన్నెల్లి, బొల్లా హౌస్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా మొదలైనప్పటికీ, పలు జిల్లాల్లో మాత్రం రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 92 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 13 నగరపాలక సంస్థల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు 99.36 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా, బరిలో ఉన్న 10,262 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అయితే పోలింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే పల్నాడు, వైఎస్సార్ జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో వాతావరణం రణరంగంగా మారింది.

పల్నాడులో ముందస్తు అరెస్ట్‌లు!

ఫ్యాక్షన్, రాజకీయ గొడవలకు కేంద్రబిందువైన పల్నాడు జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున ముందస్తు అరెస్ట్‌లకు దిగారు. మున్సిపల్ పోలింగ్ వేళ వైఎస్సార్‌సీపీ కీలక నేతలను ఇళ్లకే పరిమితం చేశారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పలువురు ద్వితీయ శ్రేణి వైఎస్సార్‌సీపీ నాయకులను బైండోవర్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

AP Municipal Elections Tension House Arrests of Top YSRCP Leaders Cause High Alert Across Palnadu District
పులివెందులలో హై టెన్షన్: జగన్ టూర్ రీ షెడ్యూల్
పులివెందులలో హై టెన్షన్: జగన్ టూర్ రీ షెడ్యూల్

పాతకక్షలు.. నామినేషన్ల నాటి ఘర్షణల నేపథ్యం!

పల్నాడు జిల్లాలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చిలకలూరిపేటలో విడదల రజినిని నిరోధించే క్రమంలో ఎస్సై ప్రియాంక అడ్డుకోవడంతో ఆమె కిందపడిపోయిన సంఘటన కలకలం రేపింది. మరోవైపు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన నరసరావుపేటలో జెడ్పీటీసీ నామినేషన్ల రోజున, అలాగే మాచర్ల, గురజాలలో ఘర్షణలు, తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకంటూ పోలీసులు ముందుగానే వైఎస్సార్‌సీపీ నేతలను నిర్బంధించారు.

ఫస్ట్ ఓటు పడింది.. పుర పోరు ప్రారంభమైంది
ఫస్ట్ ఓటు పడింది.. పుర పోరు ప్రారంభమైంది

కడపలో నోటీసుల కలకలం.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం!

అటు వైఎస్సార్ జిల్లాలోనూ పోలింగ్ వేళ తీవ్ర కలకలం రేగింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనరల్ ఏజెంట్‌గా ఉన్న ఆయనను బయట తిరగవద్దంటూ ఆంక్షలు విధించడంతో రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కడపలో అనేక చోట్ల టీడీపీ శ్రేణులు బహిరంగంగా మొహరించి ఉంటే వారిని నియంత్రించాల్సింది పోయి, రక్షణగా ఉండాల్సిన ఏజెంట్లకు నోటీసులు ఇవ్వడం ఏంటని పోలీసులను గట్టిగా నిలదీశారు. నామినేషన్ల సమయం నుంచి అధికార కూటమి నేతలకు అండగా నిలుస్తున్న పోలీసులు, పోలింగ్ రోజున కూడా అదే ఏకపక్ష వైఖరిని ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+