హైదరాబాద్: హైదరాబాద్: తీవ్ర అస్వస్థతకు గురైన తెలంగాణా పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే ఎం ఓంకార్‌ను ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈరోజు పరామర్శించారు. నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై డాక్టర్లతో చర్చించారు. ఓంకార్ వరంగల్ జిల్లా నర్సంపేటనుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీపీఎంలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం ఎంసీపీఐ పార్టీ స్థాపించారు. కాగా ఓంకార్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కూడా ఓంకార్ ను పరమర్శించారు.