హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు జరగబోవని, ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే ఉంటాయని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసినా గెలిచే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని అయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. వివిధ రాజకీయ పార్టీలుఎన్నికల పొత్తుల గురించి జరుపుతున్న చర్చలు, వివిధ పత్రికల్లో వస్తున్న వార్తా కథనాలను డిఎస్ ఎద్దేవా చేశారు. ఈ పొత్తుల వ్యవహారం సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ఎంతవరకూ అధికారంలోకి రావడమే ధ్యేయంగా సాగడంతో రాజకీయాలు అపహాస్యం పాలవుతున్నాయని ఆయన అన్నారు.