సింగరేణి రైలుకు తప్పిన ముప్పు
వరంగల్: సింగరేణి ప్యాసింజర్ రైలుకు శనివారం తెల్లవారుజామున పెద్ద ప్రమాదం తప్పింది. వరంగల్‌జిల్లా మహబూబాబాద్ దగ్గర రైలు పట్టా విరిగిపోయింది. గ్యాంగ్‌మెన్ గమనించి దగ్గరలోని సిగ్నల్ స్టేషన్‌కు సమాచారమందించాడు.
అప్రమత్తమైన సిబ్బంది అప్పుడే వస్తున్న భద్రాచలం - కాగజ్‌నగర్ సింగరేణి ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న అనేక రైళ్ళకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications