విజయనగరం జిల్లాలో జూట్మిల్లు లాకౌట్
విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని జూట్ మిల్లును యాజమాన్యం లాకౌట్ చేసింది. దీంతో వందలాది కార్మిక కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఈ మిల్లులో 4,500 మంది ఉగ్యోగులు ఉన్నారు. వీరిలో గత 25 సంవత్సరాలు నుంచి ఇప్పటి వరకు 1275 మంది రిటైర్ అయ్యారు. వారికి గ్రాట్యుటీ ఇవ్వడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. దాంతో వారు ఆందోళనకు దిగడంలో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది.
రోజుకు ముగ్గురికి చొప్పున గ్రాట్యూటీ ఇవ్వడం అదీ తక్కువ ఉన్నవారికి ఇస్తున్నారు. దీంతో కార్మిక సంఘాలు యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడు లాకౌట్ చేయడంతో వందలది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం, కార్మికులపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని కార్మికులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications