మాజీ ఐపిఎస్ అధికారి ఇంట్లో చోరీ
హైదరాబాద్ : మాజీ పోలీస్ అధికారి జనక్‌రాజ్ నివాసంలో చోరీ జరిగింది. కిటీకి వూచలు తొలగించిన దొంగలు ఆయన నివాసం నుంచి రూ.40 వేల నగదు, బంగారు నగలను అపహరించుకొని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఐపిఎస్ అధికారి అయిన జనక్ రాజ్ అడిషినల్ డిజిపి హోదాలో రిటైరయ్యారు. ఆయన బంజారాహిల్స్ నివాసంలో ఈ దొంగతనం జరిగింది. మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇంట్లోనే చోరీ జరిగినప్పుడు, సామాన్యుల పరిస్ధితి ఏమిటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications