తెలంగాణపై కాంగ్రెస్ ప్రకటన రావాలి: ఉప్పునూతల
హైదరాబాద్ : తెలంగాణపై కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్‌నాయకుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే తెలంగాణపై నిర్ణయం వెలువరించాల్సివుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఉప ఎన్నికల్లో మూడో వంతు ఓట్లు టీఅర్ ఎస్ కు, మూడో వంతు ఓట్లు టిడిపికి, మరో మూడో వంతు ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయని, ఇప్పుడు టిడిపి, టిఆర్ ఎస్ ఏక మైతే తెలంగాణలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని పురుషోత్తమరెడ్డి అన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నందువల్ల ఇక ఢిల్లీ నిర్ణయంతో పనిలేదని ఆయన అన్నారు. తెలంగాణ వాదులంతా ముందుకు వచ్చి ముక్తకంఠంతో తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా పనిచేయవలసి ఉందని ఆయన పిలుపు ఇచ్చారు.












Click it and Unblock the Notifications