న్యూడిల్లీ: ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ శనివారం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో భేటీ అయ్యారు. పొత్తుతో పాటు,వివిధ అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా 12,13,14 తేదీల్లో జరిగే సిపిఎం జాతీయ మహాసభల సమావేశంలోగా పొత్తులపై తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ చర్చలకు అరవింద్ తో పాటు హరిరామయ్య కూడా న్యూ డిల్లీ వెళ్ళారు. అయితే ఆయన చర్చలకు దూరంగా ఉన్నట్లు సమాచారం.