హైద్రాబాద్ లో పట్టపగలు ఐదు లక్షలు చోరీ
హైదరాబాద్: నగరంలోని ఒక బ్యాంకు నుంచి డబ్బు తీసుకొని వెళుతున్న ఒక వ్యక్తినుంచి నగదు లాక్కొని దుండగులు పరారయ్యారు. చైతన్యపురిలోని ఒక బ్యాంక్ నుంచి ఐదులక్షల రూపాయలు తీసుకొని వెళ్తున్న దయానంద్ అనే వ్యక్తి దృష్టిని మళ్లించిన దుండగులు నగదుతో ఉడాయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు ప్రారంభించారు. దయానంద్ ఐదు లక్షల నగదును డ్రా చేసుకుని బ్యాంకు వెలుపలికి వచ్చేసరికి దుండగులు అక్కడ పదిరూపాయల నోట్లను వెద జల్లారు. ఆ డబ్బు వైపు దయానంద్ ఆశ్చర్యంగా చూస్తుండగా దుండగులు ఆయన బ్యాగ్ ను లాగేసుకుని పరారయ్యారు.












Click it and Unblock the Notifications