ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు కంకరలోడుతో వెలుతున్న లారీ సత్తుపల్లి, వెంగళరావు నగర్ వద్ద బోల్తా పడడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం మద్దూరు వాసులుగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications