మాల, మాదిగల రెండో విడత రథయాత్ర
హైదరాబాద్: మాల, మాదిగలను కలపడమే తమ రాజ్యాధికార రథయాత్ర లక్ష్యమని, రెండో విడత పర్యటన శనివారం ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమవుతుందని మాలమహానాడు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, బీఎస్పీ(అంబేద్కర్-ఫూలే) అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మర్లపాటి సాల్మన్‌రాజులు తెలిపారు. 11న ఖమ్మం, 12న వరంగల్, 13న కరీంనగర్, 14న ఆదిలాబాద్, 15న నిజామాబాద్ జిల్లాల్లో రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
మూడో విడత రథయాత్ర ఈ నెల 17న అనంతపురం జిల్లాలో ప్రారంభం అవుతుందని జూపూడి, సూర్యప్రకాశ్, సాల్మన్‌రాజ్ వివరించారు. 17న అనంతపురం, 18న కడప, 19న కర్నూలు, 20న మహబూబ్‌నగర్, 21న నల్లగొండ, 22న రంగారెడ్డి, 23న మెదక్ జిల్లాల్లో పర్యటించి 24న హైదరాబాద్‌కు చేరుకుంటుందని వారు పేర్కొన్నారు. ఈ నెల 31న ఇక్కడి నిజాం కాలేజీ మైదానంలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల ఒకటిన మొదటి విడతగా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభించిన దళితుల ఐక్యత, రాజ్యాధికార ర«థయాత్ర ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పర్యటించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications