సిరిసిల్లలో ఆత్మస్థైర్య ర్యాలీ ఈ రోజే
హైదరాబాద్ చేనేత కార్మికుల్లో ఆత్మ స్థయిర్యాన్ని పెంపొందించేందుకు తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 11న సిరిసిల్లలో ఆత్మ స్థయిర్య ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సినీ దర్శకుడు బి.నర్సింగరావు తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. కార్మికులకు రూ.2 కోట్ల కార్పస్ ఫండ్:11 సిరిసిల్ల చేనేత కార్మికులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం రూ.2 కోట్లను విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు అందజేస్తారు.












Click it and Unblock the Notifications