భైంసాలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా, భైంసా పట్టణంలో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో శుక్రవారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. శనివారం నాటికి మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. భైంసాలో కర్ఫ్యూ విధించారు.
ఈ రోజు ఉదయం ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ భైంసా పట్టణంలో పర్యటించారు. నిమజ్జనం రోజు ఇలా జరగడం దురదృష్టకరమని, ఇక్కడితో అల్లర్లు ఆపాలని, ప్రజలంతా సంయమనం పాటించాలని, బయటకు ఎవరూ రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఘర్షణల్లో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల ఎక్స్‌గ్నేషియా ప్రకటించాలని ఒవైసీ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications