తెలంగాణ వ్యతిరేకిని కాను: వైయస్

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: తాను తెలంగాణ వ్యతిరేకినని వస్తున్న వార్తల్లో నిజం లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుటుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి గడువును తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. అందర్నీ తాము విశ్వసనీయతలోకి తీసుకుంటామని, అందరి అభిప్రాయాలను కనుక్కుంటామని, ఏకాభిప్రాయ సాధనతో తెలంగాణ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

తమ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఊసరవెల్లి రాజకీయాలకు, అవకాశవాదానికి పాల్పడుతున్నాయని, వాటిని ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. కమ్యూనిస్టులకు సిద్ధాంతాలు లేకుండా పోయానని ఆయన అన్నారు. కాంగ్రెసును ఓడించేందుకు సిద్ధాంతాలను పక్కన పెడతామని ఒక్కాయన అంటున్నారని ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులును ఉద్దేశించి అన్నారు. మరొకాయన సిద్ధాంతాలే ముఖ్యమని అంటున్నారని రాజశేఖర రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టానని చెబుతూ వచ్చిన మరొకాయన తెలంగాణ అంశాన్ని కాస్తా పక్కన పెడాతమని అంటున్నారని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పిన ఒకాయన పూర్తిగా ప్లేటు ఫిరాయించారని ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+