రాజకీయాలపై ఇప్పుడే చెప్పలేను : రజనీ

Rajinikanth
చెన్నై: తాను రాజకీయాల్లోకి వస్తానని, అయితే ఎప్పుడు వస్తాననేది ఇప్పుడే చెప్పలేనని తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ అంటున్నారు. తనను ఈ విషయంలో ఎవరూ ఒత్తిడి చేయలేరని ఆయన అన్నారు. ఒక్కసారి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గేది లేదని ఆయన అంటున్నారు. రజనీకాంత్ సోమవారం రాత్రి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని, వస్తారని ఇటీవల ఆయన అభిమానులు హడావిడి చేశారు. కోయంబత్తూరులో కొంత మంది అభిమానులు ఏకంగా దేశీయ ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో రజనీకాంత్ పేరిట ఒక పార్టీనే ప్రకటించారు. పతాకాన్ని ఆవిష్కరించారు. తనను రాజకీయాల్లోకి రావాలని ఎవరూ చేయలేరని, చేయకూడదని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకునే అభిమానులు తమకు ఇష్టమైన పార్టీల్లో పనిచేయవచ్చునని ఆయన చెప్పారు. దీంతో రజనీ అభిమానుల హడావిడికి తెర పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+