ఐటిపై విమర్శలన్నీ అబద్ధం: చిరు
విశాఖపట్నం: తాను ఆదాయం పన్ను సరిగా కట్టలేదనే విమర్శల్లో నిజం లేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. తాను సరిగా ఆదాయం పన్ను చెల్లించడం వల్ల ఉత్తమ సమ్మాన్ అవార్డు లభించిన విషయాన్ని అలాంటి విమర్శలు చేస్తున్నవారు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఆయన ప్రజా అంకిత యాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతోంది. కొందరు నాయకులే ఆదాయం పన్ను ఎగగొడుతున్నారని ఆయన అన్నారు.
రాజకీయ నాయకులు చందమామను చూపిస్తున్నారని, తద్వారా ఓట్లు దండుకుని ప్రజలను మరిచిపోతున్నారని ఆయన అన్నారు. విలాసాల కోసం, సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూడడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. ప్రజల జీవితాల్లో చిరునవ్వులు తేవడానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ స్టాలిన్ కావాలని ఆయన పిలువునిచ్చారు.












Click it and Unblock the Notifications