చిరుతోనే సామాజిక న్యాయం: పవన్

Pawan Kalyan
హైదరాబాద్: అన్నయ్య చిరంజీవితోనే సామాజిక న్యాయం సాధ్యమని సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహింపట్నం, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో ఆయన బుధవారం ప్రజారాజ్యం పార్టీ పతాకను అవిష్కరించి రోడ్ షో నిర్వహించారు. దళిత, బలహీనవర్గాలకు అవకాశాలు లభించినప్పుడే సామాజిక న్యాయం చేకూరుతుందని, అది చిరంజీవి ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు. చిరంజీవి స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారని ఆయన అన్నారు.

ఓట్ల కోసమే ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వస్తారని, చిరంజీవి అలా కాదని, ప్రజలకు మేలు చేయడానికి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని ఆయన అన్నారు. చిరంజీవితోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలన్నదే చిరంజీవి మతమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో నడిపించడం ద్వారా, సామాజిక న్యాయాన్ని సాధించడం ద్వారా చిరంజీవి అందరికీ సమాధానం చెప్తారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+