రామోజీ భయపెడుతున్నారు: ఉండవల్లి

హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుపై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి ధ్వజమెత్తారు. రామోజీరావు తనకు లీగల్ నోటీసు ఇవ్వడంపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. తనకు లీగల్ నోటీసు ఇవ్వడం సంతోషకరమని, రామోజీ రావు అక్రమాలను కోర్టులో బయట పెడతానని ఆయన అన్నారు. మార్గదర్శి అక్రమాలను తాను బయట పెడతానని ఆయన అన్నారు. తన వద్ద పనిచేసేవారికి కూడా చట్టాలను అతిక్రమించి రామోజీరావు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రామోజీరావు వద్ద పనిచేసే కార్మికులు తన వద్దకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

రామోజీరావు ఇష్టారాజ్యంగా చట్టాలను ధిక్కరిస్తున్నారని, దానికి ఈనాడు పత్రికను అడ్డు పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రామోజీరావు అవినీతిపై తాను పోరాటం చేస్తానని ఆయన చేశారు. రామోజీరావు తనను భయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రామోజీ రావుపై చేసే పోరాటంలో తనకు సహకరించాలని ఆయన మీడియాను కోరారు. తాను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, అవినీతిపై పోరాటం చేయడానికి రాజకీయాల్లో ఉన్నానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+