ఆస్పత్రి నుంచి అమితాబ్ డిశ్చార్జ్

తన తండ్రి ఆస్పత్రిలో ఉండగా తగిన సహకారం అందించిన అభిమానులకు, జర్నలిస్టులకు అభిషేక్ బచ్చన్ కృతజ్ఞతలు తెలిపారు. అమితాబ్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన కుటుంబ సభ్యుల సినిమా షూటింగులన్నీ దెబ్బ తిన్నాయి. మణిరత్నం నిర్మిస్తున్న రావణ చిత్రం కోసం అభిషేక్, ఆయన భార్య ఐశ్వర్య రాయ్ కేరళ వెళ్లాల్సి ఉంది. ముంబయిలో తీన్ పాటీ సినిమా షూటింగులో అమితాబ్ స్వయంగా పాల్గొనాల్సి ఉండింది. ఇదిలా ఉంటే, ఈ కుటుంబానికి మరో దుర్వార్త కూడా చేరింది. ఐశ్వర్య తండ్రి కృష్ణరాజ్ రాయ్ అస్వస్థతతో బుధవారం రాత్రి ముంబయిలో హిందూజ ఆస్పత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications