ఇక కొద్ది రోజులే, ధైర్యంగా ఉండండి: బాబు

Chandrababu Naidu
కరీంనగర్: ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నేత కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులు ఆగితే తామే నేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నేత కార్మికుల బాధితులను ఆయన శుక్రవారంనాడు పరామర్శించారు. నేత కార్మికుల తరఫున తాము పోరాడుతామని, న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి నేత కార్మికులు చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట సిరిసిల్ల శాసనసభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు, తెలుగుదేశం నాయకుడు ఎల్. రమణ తదితరులు ఉన్నారు.

నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన సిరిసిల్లాకు వచ్చే ముందు హైదరాబాదులో అన్నారు. బిసిలను, చేతివృత్తులవారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నేత కార్మికుల సమస్యలు పరిష్కారమై ఉండేవని ఆయన అన్నారు. తాము పెట్టిన టెక్స్ టైల్ పార్కును నిర్లక్ష్యం చేసి అపారెల్ పార్కు పెడతామని ప్రభుత్వం చెప్పిందని, దాన్ని కూడా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నేత కార్మికుల పరిస్థితి భయంకరంగా ఉందని ఆయన అన్నారు. పౌష్ఠికాహారం లేక కూడా నేత కార్మికులు మరణిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+