వైయస్ పై కాంగ్రెస్ ఎంపీ రుసరుసలు
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కార్యవర్గంపై కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులకే పిసిసిలో ప్రాధాన్యం లభించిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ విమర్శించారు. మొదటి నుంచీ రాజేశేఖర రెడ్డి వందిమాగధులకే పదవులు దక్కుతున్నాయని, పిసిసి విషయంలోనూ అదే జరిగిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో గుర్తింపు లభిస్తుందనే నమ్మకం కార్యకర్తలకు లేకుండా పోయిందని ఆయన అన్నారు.
పసిసి కార్యవర్గాన్ని చూసిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుందని ఆయన అన్నారు. పిసిసిలో సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీలకు కూడా తగిన ప్రాధాన్యం లభించలేదని ఆయన అన్నారు. సీపోర్టు విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలో నిజం ఉందనే విషయం బలపడుతోందని, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సన్నిహితుడికి రాయితీలు ఇచ్చారనే విషయం బలపడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications