ముంబయ్: శుక్రవారం ఉదయం సెన్సెక్స్ ఆశావహంగా ప్రారంభమైంది. ముంబయ్ స్టాక్ ఎక్సేంజి 30 షేర్ల సెన్సెక్స్ నిన్నటితో పోల్చితే 149.67 పాయింట్లు పెరిగి ఉదయం సెషన్ లో 10,731కి చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజి సూచిన నిఫ్టి 46.85 పాయింట్లు పెరిగింది. సత్యం, టాటా మోటార్స్, జీ ఎంటర్ టైన్ మెంట్, రిలయెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్ అండ్ టి, బిహెచ్ ఇఎల్, సీమెన్స్, స్జ్లాన్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, టిసిఎస్, టాటా స్టీల్ శుక్రవారం ఉదయం పుంజుకున్నాయి. ఏషియన్ మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్ నడుస్తోంది.