పదివేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
ముంబయ్: తీవ్ర అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ శుక్రవారం ఒక దశలో పదివేల పాయింట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ ఇంత దిగువకు పడిపోవడం గత రెండేళ్ళలో ఇదే ప్రధమం. ఉదయం 9,975కు పడిపోయిన తర్వాత మధ్యాహ్నానికి కొంత కోలుకుని 10,017 పాయింట్ల వద్ద ట్రేడింగ్ జరిగింది.
రిలయెన్స్ ఇన్ ఫ్రా 11 శాతం తగ్గి బాగా నష్టపోయింది. జెపి అసోసియేట్స్ 9 శాతం, ఎన్ టిపిసి 9 శాతం, ఆర్ కాం 9 శాతం చొప్పున పడిపోయాయి. తీవ్ర అమ్మకాల వత్తిడి కారణంగా బ్యాంకు షేర్లు కూడా నష్టపోయాయి. ఒ ఎన్ జిసి వంటి నవరత్న కంపెనీ షేర్లు కూడా పడిపోవడం విశేషం. ఉదయం సెన్సెక్స్ ఆశావహంగా ప్రారంభమైంది. ముంబయ్ స్టాక్ ఎక్సేంజి 30 షేర్ల సెన్సెక్స్ నిన్నటితో పోల్చితే 149.67 పాయింట్లు పెరిగి ఉదయం సెషన్ లో 10,731కి చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజి సూచిన నిఫ్టి 46.85 పాయింట్లు పెరిగింది. సత్యం, టాటా మోటార్స్, జీ ఎంటర్ టైన్ మెంట్, రిలయెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్ అండ్ టి, బిహెచ్ ఇఎల్, సీమెన్స్, స్జ్లాన్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, టిసిఎస్, టాటా స్టీల్ శుక్రవారం ఉదయం పుంజుకున్నాయి. ఏషియన్ మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్ నడుస్తోంది












Click it and Unblock the Notifications