ఎయిర్షోలో సందర్శకుల సందడి
హైదరాబాద్: బేగంపేటలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌షో శనివారంతో ముగుస్తోంది. తొలి మూడు రోజులు వ్యాపార ప్రతినిధులను మాత్రమే అనుమతించారు. ఈరోజు సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. 150 రూపాయల రుసుముతో ఎవరైనా చూసే అవకాశం కల్పించారు. అయితే ప్రజల్లో ఆసక్తి రేపిన జింబో ఎయిర్‌బస్ ఈ ప్రదర్శనలో లేకపోవటం ప్రజలను కొంత నిరాశకు గురిచేస్తోంది. అయినా సందర్శకులు హెలికాప్టర్లలో పైలట్ కూర్చునే కాక్‌పిట్‌లోనికి కూడా వెళ్లికూర్చునే అవకాశం ఉండటంతో సంబరపడుతున్నారు.












Click it and Unblock the Notifications